పత్రికా ప్రకటన. తేది:08.06.2022, వనపర్తి.
గ్రామీణ అభివృద్ధి సాధించేందుకు వివిధ పథకాలకు సకాలంలో నిధుల రూపంలో రుణాలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి బ్యాంక్ అధికారులకు ఆదేశించారు.
బుధవారం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆజాదిక అమృత మహోత్సవం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కస్టమర్ అవుట్ రీచ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి జెడ్.పి.చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ బ్యాంకర్లు ప్రజలతో మమేకమై ప్రభుత్వ రుణాలను సకాలంలో అందజేయాలని ఆయన అన్నారు. పి.ఎన్.జి.వై. రుణాలను మన రాష్ట్రానికి అందించాలని, తెలుగు రాష్ట్రాలలో రుణాలు అందించక పోవటంతో పేద ప్రజలు లబ్దిపొందలేక పోతున్నారని ఆయన అన్నారు. లబ్ది రారులతో సమావేశాలు నిర్వహించి, 100 శాతం రుణాలు అందించేలా బ్యాంకర్లు కృషి చేయాలని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరం గ్రామాలలో నిధులుండేలా ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నారని, అట్టి పథకాలకు సకాలంలో రుణాలు అందించి బ్యాంకర్లు ఆదుకోవాలని ఆమె అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని బ్యాంకులు ఉన్న ప్రతి గ్రామంలో సుమారు 25 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగిందని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు గ్రామాలలోని నిరుపేదలకు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి. కేటగిరీల లోని నీరు పేదలకు సహకరించాలని ఆమె కోరారు. జిల్లాలో గత సంవత్సరం 220 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వగా, ఈ సంవత్సరం 252 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ఆమె తెలిపారు. స్త్రీనిధి కి రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు ఆమె సూచించారు.
2014 సం. కి పూర్వం మండలానికి ఒక బ్యాంక్ ఉండేదని, ప్రస్తుతం ప్రతి నాలుగు గ్రామాలకు కలిపి ఒక బ్యాంకు ఏర్పాటు అయిందని, భవిష్యత్తులో రెండు గ్రామాలకు ఒక బ్యాంకు వస్తుందని, దీనిపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. రుణాల మంజూరులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, ఒకవేళ ఎవరైనా దళారీల ప్రమేయం ఉన్నట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బ్యాంకర్లు వినియోగదారులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడి లబ్ధిదారుల సమస్యలను తీర్చాలని, అప్పుడే లబ్దిదారులు బ్యాంకులకు సహకరిస్తారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే రుణాల గురించి ప్రజలకు విసృతంగా తెలియజేయాలని, వినియోగదారులు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు పూర్తి సహకారం అందించాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సురేష్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, పాల్గొన్నారు.
____________
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయబడినది.