యూపిఎస్సి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*జూన్ 03*

*యూపిఎస్సి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు.*

*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

యూపిఎస్సి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

శుక్రవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో యూపిఎస్సి పరీక్షల అధికారి సుధీర్ ఆగర్వాల్తో సంబంధిత శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఈ ఆదివారం నాడు జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం (14) సెంటర్స్ ఉన్నాయని మొత్తం 6009 మంది అభ్యర్ధులు ధరకాస్తు చేసుకున్నారని (5) రూట్లలో , రూట్ ఆఫీసర్స్,14 మంది ప్రత్యేక అధికారులను నియమించమని పరీక్ష కేంద్రాలలో త్రాగు నీరు, విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, పరీక్షల నిర్వహణ సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post