యోగ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, ఏకాగ్రత తో యోగ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు.

పత్రిక ప్రకటన                                                            తేది:23-12-2021

యోగ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, ఏకాగ్రత తో యోగ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు.

గురువారం ఆజాది కా అమృత్ మహోత్సవాలలో బాగంగా జరుపుకుంటున్న నది సంబరాల కార్యక్రమం  జిల్లా నది అగ్రహారం లో యువజన క్రీడల అభివృద్ధి శాఖ  ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన యోగ మరియు ధ్యాన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ యోగాను  మొదట గా మన భారతదేశం లోనే  పాటించడం జరిగిందని, యోగా అనేది దేవుడు మనకు ఇచ్చిన  గొప్ప వరమని తెలిపారు. మనమే యోగా ను ఇతర దేశాలకు అందించామని, భారతీయుల జీవన శైలి లో యోగా కు గోప్ప ప్రాముఖ్యత ఉందని తెలిపారు.  క్రమం తప్పకుండా యోగ చేయడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని, ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని, మానసికంగాను, మరియు శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటారని, యోగ వల్ల ఇంకా చాలా లాబాలు ఉన్నాయని అన్నారు. నిరంతరంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చాల ఉపయోగాలు ఉంటాయని, దిన్ని ఇలాగే కొనసాగించాలని అన్నారు.  ఈ కార్యక్రమాన్ని నది ప్రాంతం లో ఏర్పాటు చేయడం చాల సంతోషంగా ఉందని, ఒక వైపు నీళ్లు, మరొక  వైపు సూర్యుడు, పంచభూతాల మధ్య యోగ చేయడం మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి యోగ చేశారు.

కార్యక్రమం లో యువజన క్రీడల అభివృద్ధి అధికారి  రమేష్ బాబు, డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, డి.పి.ఆర్.ఓ చెన్నమ్మ,  పశు వైద్య అధికారి వెంకటేశ్వర్లు , సక్రియా నాయక్ , యోగ మాస్టర్ మల్లికార్జున  చారి తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

 

 

 

Share This Post