రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లుతున్నాము -రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఆదివారం రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా
పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశమునకు రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు
తీసుకెళ్లుతున్నామని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు
కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని
ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ పేరున,
మున్సిపాలిటీలలో మున్సిపాలిటీల పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు,
ఈనెల 17వ తేదీ నుండి గ్రామాలలోని గ్రామ ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు
వీలుగా ప్రణాళిక సిద్ధం చేసుకోని ప్రభుత్వ భూములను వంద శాతం గుర్తించాలని
జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.  మండల సర్వసభ్య సమావేశాల్లో మండల
అధికారులు తప్పకుండా హాజరుకావాలని,  హాజరు కాని వారి పేర్లను జిల్లా
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లితే వారిపై చర్యలు తీసుకోబడతాయని మంత్రి
తెలిపారు.
దివ్యాంగుల కోసం నిర్వహించే సదరన్ క్యాంపు కొండాపూర్, వనస్థలిపురంలో
ఉన్నందున దివ్యాంగులకు ప్రయాణం చేయడం కష్టమవుతుందని ఎమ్మెల్యే జైపాల్
యాదవ్ మంత్రి గారికి తెలుపగా మంత్రి స్పందిస్తూ ప్రతి రెవెన్యూ డివిజన్
లో  సదరం క్యాంప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరారు. సర్ఫ్ సిఈఓ తో
మాట్లాడి  ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
అర్హులైన వారికి పెన్షన్ లు అందించాలని జడ్పిటిసి వెంకటేష్  కోరగా తప్పక
అంద చేస్తామని మంత్రి తెలిపారు.
రైతువేదిక ద్వారా రైతులకు లాభం వచ్చే పంటలు కూరగాయలు, పప్పు దినుసులు
పండించే విధంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు.
రైతు బీమా ఆన్లైన్ లో నిరంతరం చేసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.
రేషన్ కార్డులు అర్హులైన వారిని గుర్తించి ఇవ్వడం జరిగిందని, రేషన్
కార్డు రాని వారికి కూడా ఇస్తామని తెలిపారు.
అధిక వర్షాలు పడినందుకు రైతులకు పంట నష్టం చెల్లించాలని జడ్పీటీసీలు
కోరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లితామని తెలిపారు.

భూ సమస్యలపై జిల్లాలో 80 వేల దరఖాస్తులు వచ్చాయని అందులో 72 వేల
దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించడం జరిగింది అని మిగిలిన ఎనిమిది వేల
దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
తెలిపారు. యాసంగిలో వరి  ఎక్కువగా  పండినందున గన్ని బ్యాగులు కొరత
వచ్చిందని ఈసారి ముందుగానే గన్ని బ్యాగులు కొరకు ఆర్డర్ చేయడం జరిగిందని
తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలని, టీచర్లు
లేనిచోట వెంటనే నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్, మంచి నీటి సౌకర్యాలు కల్పించాలని జిల్లా
సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. కోవిడ్ సమయంలో వైద్యాధికారులు,వైద్య
సిబ్బంది ప్రజలకు చేసిన సేవలకుగాను మంత్రి, ఇతర  సభ్యులు  అభినందించారు.
వ్యాక్సిన్ ఇవ్వడంలో కూడా రంగారెడ్డి జిల్లాలో 90 శాతం వరకు పూర్తి చేయడం
జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా
చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు.  గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల
మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సబ్ సెంటర్లలో వైద్యులు,సిబ్బంది కొరత
గురించి, పరికరాలు, భవనాలు గురించి నివేదిక వెంటనే ప్రజా ప్రతినిధులతో
చర్చించి సమర్పించాలని ఆదేశించారు.  ప్రజాప్రతినిధులకు వేతనాలు
పెంచినందుకు ముఖ్యమంత్రికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, షాద్ నగర్  ఎమ్మెల్యే అంజయ్య
యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదయ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు,
ఎంపీటీసీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post