రంగారెడ్డి జిల్లాను ఎగుమతుల హబ్ గా తీర్చిదిద్దాలి- రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్

రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్  20:: రంగారెడ్డి జిల్లా ను ఎగుమతుల హబ్ గా తీర్చిదిద్దాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టరు తన ఛాంబర్లో వాణిజ్య ఎగుమతులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం సిద్దించి 75 వసంతాలు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న అజాధికా అమృత్ మహిత్సవంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా ఈ నెల 24 శుక్రవారం ఖైరతాబాద్ లోని జిల్లా ప్రజా పరిషత్తులో కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఎగుమతి దారులకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపాన ఉన్నందున ఎగుమతుల చేసి ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉందని తెలిపారు. జిల్లా నుండి మామిడి పండ్లు , పూలు, పండ్లు , కూరగాయలు ఎగుమతి చేసేవిధంగా ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు. ఎగుమతులను ప్రోత్సాహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీలను ఎగుమతి దారులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎగుమతిదారులను, ఎగుమతి చేయుటకు ఆసక్తి గల వారిని ఆహ్వానించాలని తెలిపారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి గీతా రెడ్డి , ఉద్యానవన శాఖ అధికారి డాక్టర్ సునంద రాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్, ఏజీ ఎం హన్మంతరెడ్డి , ఏడి మైన్స్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post