రంగారెడ్డి  జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరి పద్ధతి ద్వారా పూర్తి పారదర్శకంగా కేటాయించడం జరిగింది – జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రంగారెడ్డి  జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరి పద్ధతి ద్వారా పూర్తి పారదర్శకంగా కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.
శనివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సరూర్ నగర్ యూనిట్ 134 రిటైల్ మద్యం దుకాణాల ఎంపిక  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలను  కేటాయించారు.

శంషాబాద్ యూనిట్ 100 రిటైల్ మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలను  కేటాయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పూర్తి పారదర్శకతతో మద్యం దుకాణాల లాటరీ  నిర్వహించడం జరిగినదని,  రంగారెడ్డి జిల్లా  ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మొత్తం 234 షాపులు ఉండగా, అందులో సరూర్  నగర్ ఎక్సైజ్ యూనిట్  134 వైన్ షాపులకు సంబంధించి 4102, శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ 100 వైన్ షాపులకు సంబంధించి 4137 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమ్యూనిటీ లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పించినట్లు  కలెక్టర్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు శనివారం లక్కీ డ్రా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని మద్యం షాపులను పారదర్శకంగా లాటరీ
ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘునాథ్, శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post