శుక్రవారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాల్ లో అదనపు కలెక్టరులు, డి ఆర్ ఓ, తాసీల్దారులతో ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తి అయినా సందర్బంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశం నిర్వహించారు’. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన.ధరణి కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోందని తెలిపారు.
ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంది, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ భూ సంబంధిత లావాదేవీలకు ధరణి నాన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందన్నారు
రంగారెడ్డి జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోంది. ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సహచర అధికారులు, తహసీల్దార్లు, మండల అధికారులను అభినందించారు .
ఈ విషయంలో తమ పూర్తి సహాయ, సహకారాలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని అందింస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి.అప్పుడు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి కావు. ఇప్పుడు జిల్లాలో ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. .
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయి. ధరణి ప్రారంభానికి ముందు దీనికి గంటలు, గంటల సమయం పట్టేది. గతంలో తక్కువ గా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవని అన్నారు
ధరణి లో ప్రత్యేకతలు
* టాంపర్ ప్రూఫ్. *పౌరులకు అనువుగా ఉండడం. *తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం. *పారదర్శకత. *ఆధునిక సాంకేతికత వినియోగం. *వివక్షకు తావులేకుండా ఉండడం. *అతితక్కువగా అధికారుల జోక్యం
ధరణి నిర్వహణా ప్రత్యేకతలు
*అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం. *బయో మెట్రిక్ నిర్ధారణ. *ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ. *రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్. *రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం. *ఆన్లైన్ చెల్లింపులు. *అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ. *పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం పంపిని. *నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం. .
నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.
రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు
హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ధరణి లావాదేవీలు
విక్రయాలు : 61,289
గిఫ్ట్ డీడ్ : 7,518
వారసత్వం :4,571
*జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు *
పెండింగ్ మ్యుటేషన్లు. : 27963
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 19442
నిషేధించబడిన జాబితా : 4294
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 6243
*నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టరులు పత్రిక జైన్, తిరుపతి రావు, ట్రైనీ కలెక్టర్ కదిరవన్ ఫళని, డి ఆర్ ఓ హరిప్రియ, తహసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.