రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పతాకావిష్కరణ గావించారు.

రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పతాకావిష్కరణ గావించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ ను పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. శకటాల ప్రదర్శన, నాగార్జున హై స్కూల్ రాయదుర్గం మరియు శివరాంపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 185 ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఈ నెల 16 వ తేది నుండి అమలు చేస్తున్న 50 వేల రూపాయల లోపు రుణ మాఫీ ద్వారా జిల్లాలోని 24 వేల 13 మంది రైతులకు 82 కోట్ల 49 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించిన చెక్కును జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి,లీడ్ బ్యాంక్ మేనేజర్ కు మంత్రి అందజేశారు. జీవన జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య సంఘాల 2 వేల 866 సహాయ సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా నూట పదకొండు కోట్ల 96 లక్షల రూపాయల రుణాలను 27 వేల 981 మంది సభ్యులకు అందజేయడం జరిగింది. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా యువత ఆర్థికంగా ఎదిగేందుకుగాను 11 మందికి అద్దె వాహనాలు నడుపుకొనుటకు 79 లక్షల రూపాయలకు గాను 29 లక్షల సబ్సిడీని ఇవ్వడం జరిగింది. జిల్లాలో 9 మంది దివ్యాంగులకు పునరావాస పథకం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు 19 లక్షల రూపాయలు మంజూరు కాగా అందులో 12 లక్షల సబ్సిడీని ఇవ్వడం జరిగింది.

Jateeya jandanu aavishkarinchina vidyasaakhamantri sabhita indra reddy

“]

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, డీఆర్వో హరిప్రియ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు, ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post