పత్రికా ప్రకటన. తేది:03.05.2022, వనపర్తి.
రంజాన్ పండగను పురస్కరించుకుని మంగళవారం వనపర్తి పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.