రంజాన్ పండుగను ప్రశాంతం గా జరుపుకోవాలని ప్రభుత్వచీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

ప్రెస్ రిలీజ్

21.03.2023.

రంజాన్ పండుగను ప్రశాంతం గా జరుపుకోవాలని ప్రభుత్వచీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఈ నెల 23న ప్రారం భం కానున్న రంజాన్‌ సందర్భంగా చీఫ్ విప్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలందరు కలిసి కట్టుగా పండుగ లను జరుపుకోవాలన్నారు. మున్సిపాలిటీ, మసీదుల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రాత్రి 11 గంటల వరకు పండ్ల దుకాణాలు నిర్వహించుకోవచ్చని సూచించారు. మసీదులు,ఈద్గాల వద్ద విద్యుత్‌ దీపాల ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. పండగ సామరస్యంగా జరిగేలా మత పెద్దలు కృషి చేయాలి అని అన్నారు. అన్నీ పండగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. గంగ జ తెహజిబ్ సంస్కృతి ఈ రాష్ట్ర ములో వర్ధిల్లుతుంది అని అన్నారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…రంజాన్ పండుగ సందర్భంగా మజీదులు,ఇతర పవిత్ర స్థలాల యందు శానిటేషన్,వీధి లైట్లు,కరెంట్,వాటర్ మొదలగు అవసరాల పై మతపెద్దలు తెలిపిన సూచనలను పరిగణలోనికి తీసుకుంటామన్నారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎక్కడ కూడ ఇబ్బందులు జరగకుండా సమన్వయం తో అధికారులు కలిసి పని చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, Dy. మేయర్ రిజ్వానా సుల్తాన్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, DRO వాసుచంద్ర,పరకాల RDO రాములు, DMWO శ్రీనివాస్, PD DRDA శ్రీనివాస్,DMHO సాంబశివరావు,DPO జగదీశ్వర్, ఏసిపి హనుమకొండ కిరణ్ కుమార్ , DCSO వసంతలక్ష్మి, హనుమకొండ తహశీల్దార్ రాజ్ కుమార్,తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post