రంజాన్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

రంజాన్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలో రంజాన్ పండగను ప్రశాంత వాతావరణంలో కలిసికట్టుగా సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్ తో కలిసి రెవెన్యూ, పంచాయతీరాజ్,కార్మిక, మున్సిపల్ కమీషనర్లు, విద్యుత్,రెవెన్యూ, తదితర శాఖల అధికారులు, మసీదు కమిటీ పెద్దలు, మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కలిసి పండుగ జరుపుకునే విధంగా సహకరించాలన్నారు.

మున్సిపాలిటీ, మిషన్ భగీరథ అధ్వర్యంలో మసీదులలో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.

రంజాన్ మాసంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, గ్రామాలలో పంచాయతీ రాజ్, పట్టణంలో మున్సిపల్ శాఖ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

మసీదులు, ఈద్గాల వద్ద విద్యుత్ దీపాల ఏర్పాట్లు, మరమ్మత్తు చర్యలను పూర్తి చేయాలని ఆదేశించారు.

శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.

రెవెన్యూ డివిజన్ల పరిధిలో రంజాన్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ, ఇఫ్తార్ విందు కార్యక్రమాల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మురుగు కాలువల పరిశుభ్రత, వాహనాల పార్కింగ్, రంజాన్ తోఫా కిట్ల పంపిణీ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా సంబందిత అంశాలపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్, మైనారిటీ సంక్షేమ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, కార్మిక, విద్యుత్, పౌరసరఫరాలు, తదితర శాఖల అధికారులు,
రెవిన్యూ డివిజనల్ అధికారి, మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post