రంజాన్ పర్వదిన వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—4

తేదీ.26.4.2022

రంజాన్ పర్వదిన వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల ఏప్రిల్ 26:- జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.రంజాన్ ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలు సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ చేసే ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మసీదులో టెంట్ల ఏర్పాటు త్రాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీల వారిగా చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ రివ్యూ తీసుకున్నారు.

మసీదుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, దోమల సమస్య రాకుండా ఫాగింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో త్రాగునీటి, స్ట్రీట్ లైట్ వన్డే సమస్యలు ఉత్పన్నం కాకుండా మున్సిపల్ కమిషనర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సమావేశంలో పాల్గొన్న ఎస్ పి సింధు శర్మ మాట్లాడుతూ రంజాన్ పర్వదిన ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మార్చి 31న కలెక్టర్ ప్రతి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, వాటిని తప్పకుండా పాటించాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ పర్వదిన వేడుకలు నిర్వహించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు.

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత , జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీమతి ఆర్.డి.మాధురి , ఇంచార్జి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి లక్ష్మీ నారాయణ, మునిసిపల్ కమిషనర్,లు సంబంధిత అధికారులు ముస్లిం మత పెద్దలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

ప్రచురణార్థం---4 తేదీ.26.4.2022 రంజాన్ పర్వదిన వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:: జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల ఏప్రిల్ 26:- జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.రంజాన్ ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలు సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.  ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ చేసే ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మసీదులో టెంట్ల ఏర్పాటు త్రాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీల వారిగా చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ రివ్యూ తీసుకున్నారు.  మసీదుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, దోమల సమస్య రాకుండా ఫాగింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో త్రాగునీటి, స్ట్రీట్ లైట్ వన్డే సమస్యలు ఉత్పన్నం కాకుండా మున్సిపల్ కమిషనర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఎస్ పి సింధు శర్మ మాట్లాడుతూ రంజాన్ పర్వదిన ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మార్చి 31న కలెక్టర్ ప్రతి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, వాటిని తప్పకుండా పాటించాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ పర్వదిన వేడుకలు నిర్వహించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు.  అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత , జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీమతి ఆర్.డి.మాధురి , ఇంచార్జి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి లక్ష్మీ నారాయణ, మునిసిపల్ కమిషనర్,లు సంబంధిత అధికారులు ముస్లిం మత పెద్దలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
రంజాన్ పర్వదిన వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post