రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చే ఇఫ్తార్ విందు ఏర్పాట్ల గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది

*ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రంగా వర్థిల్లుతున్నది: మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ*

*అన్ని వర్గాలకు సంతృప్తి కలిగే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నయ్: మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ*

*రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చే ఇఫ్తార్ విందు ఏర్పాట్ల గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది*

*ఎల్.బి.స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్,డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్,ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి.కాంతి వెస్లీ,Wakf Board మాజీ ఛైర్మన్ మహ్మద్ సలీం,కార్పోరేటర్ బాబా ఫసీయోద్దీన్, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు రంగనాథ్,రమేష్ చంద్ర,ప్రకాష్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు*

 

*హైదరాబాద్:* ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప లౌకిక రాజ్యంగా వర్థిల్లుతున్నదని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు చెప్పారు.అన్ని కులాలు, మతాల విశ్వాసాలను కాపాడే విధంగా,ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా సుపరిపాలన కొనసాగుతున్నదన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు,కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు.బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర అంతటా అధికారికంగా ఘనంగా జరుపుతుండడాన్ని మంత్రులు గుర్తు చేశారు.పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29వ తేదీన ఎల్.బి.స్టేడియంలో  ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సంబంధిత శాఖల అధికారులతో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ఇచ్చే  ఇఫ్తార్ విందుకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ప్రజా ప్రతినిధులు,మత పెద్దలు, ప్రముఖులు హాజరవుతారన్నారు.అతిథులకు ఆహ్వాన పత్రికలు సకాలంలో అందేలా చూడాలని, క్రమశిక్షణతో స్వాగతం పలికి,మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రులు ఆదేశించారు.వేదికను అందంగా అలంకరించాలని,ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీ చేయించాలని,ఏ మాత్రం కొరత రానివ్వకుండా అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.

ఏర్పాట్లకు సంబంధించిన మ్యాపును మంత్రులు పరిశీలించి, స్టేడియం అంతటా కలియ తిరిగి పర్యవేక్షించారు.

 

*ట్రాఫిక్ జామ్ కావొద్దు, విద్యుత్తు సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు:ఖాన్*

విద్యుత్తు, తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం రానివ్వొద్దని ప్రభుత్వ సలహాదారు అధికారులకు పలు సూచనలు చేశారు.స్టేడియం,దాని పరిసరాలను ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు దీపాలతో అలంకరించుకోవాలని,జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని,ముఖ్య కూడళ్లలో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, వాహనాల రాకపోకలు సజావుగా సాగే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఖాన్ కోరారు.

Share This Post