రక్తదానం ప్రాణదానంతో సమానం జిల్లా కలెక్టర్ డి హరిచందన
వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ దిహరిచందన రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. అనేక అత్యవసర పరిస్థితులలో దాతలిచ్చిన రక్తంప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తెరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో రక్తదానానికి ఒక రోజు కేటాయించడం చాలా సంతోషమని అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలను 15రోజుల పటు అనేక కార్యక్రమంలు చేపదుతున్నామని జిల్లా లో రెండు నియోజకవర్గాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వజ్రోత్సవంలో భాగంగా బుధవారం అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గానికి 75 మంది రక్తదాతలతో రక్తదాన శిబిరంలో పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నేడు రక్త దానశిబిరం లో పాల్గొన్న ప్రతి ఒక్క యువకులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. రక్త దానం చేసిన యువకులకు ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ సెర్టిఫికేట్ లను అందించడం జరిగింది. జిల్లా కలెక్టర్ రెబెన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పద్మజ రాణి, జిల్లా వైద్యదికారి డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ రంజిత్, మల్లికార్జున్, జిల్లా అధికారులు శివప్రసాద్, అర్దిఒ రంచదర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గాంధే అనసుయ్య చంద్రకాంత్, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు.