రక్తపోటు, మధుమేహం తో బాధపడే వారికి NCD మందుల కిట్స్ క్రమం తప్పకుండా ప్రతి నెల అందించాలి… రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.

రక్తపోటు, మధుమేహం తో బాధపడే వారికి NCD మందుల కిట్స్ క్రమం తప్పకుండా ప్రతి నెల అందించాలి… రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.

ప్రచురణార్థం

రక్తపోటు, మధుమేహం తో బాధపడే వారికి NCD మందుల కిట్స్ క్రమం తప్పకుండా ప్రతి నెల అందించాలి… రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.

మహబూబాబాద్, మే -10:

రక్తపోటు, మధుమేహం తో బాధపడే వారికి NCD మందుల కిట్స్ క్రమం తప్పకుండా ప్రతి నెల అందించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండ లో NCD మందుల కిట్లను రాష్ట్ర మంత్రులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తో కలిసి కిట్స్ ను మంత్రి ఆవిష్కరించారు.

16 రాష్ట్రాలు కలిపి 27 లక్షల మందిని క్లీనింగ్ చేస్తే 72 లక్షల మందిని క్లీనింగ్ చేసి మొదటి స్థానంలో నిలిచిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని దానికి గర్వకారణమని మంత్రి అన్నారు.
క్రమం తప్పకుండా ఎన్ సి డి కిట్ లో అందజేసే మందులను అధిక రక్తపోటు మధుమేహం ఉన్నవారు వాడి ప్రాణాలు కాపాడుకోవాలని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో 1.80 కోటి మందిని స్క్రీనింగ్ చేసి12,96,887 మంది రక్తపోటు వారిని,5,94,866 మంది మధుమేహం ఉన్న వారిని గుర్తించి అందరికీ చికిత్స అందజేస్తూ తగు సమయంలో మందులు కూడా సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీరిలో ఇప్పటికే 52 శాతం మంది ఏఎన్ఎం పాఠశాల ద్వారా మందులు అందజేయడం జరుగుతుందని, మహబూబాద్ జిల్లా లో 39,341 మంది రక్తపోటు వారిని, 16,280 మధుమేహం ఉన్న వారిని గుర్తించి అందులో 60 శాతం మందికి 33,372 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం ఆశాలు ద్వారా మందులు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మందులు వాడుతున్న వారిలో అధికంగా 64% మంది కంట్రోల్ రేటు నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రమని, క్యాన్సర్ స్క్రీనింగ్( నోటి రొమ్ము గర్భాశయం) వారిని వెంటనే గుర్తించి పరీక్షలు చేయాలని రక్తపోటు మధుమేహం రెండో రౌండు క్లీనింగ్ ప్రారంభించిన ఏకైక రాష్ట్రం మనదేనని వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర మంత స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
అనంతరం రక్తపోటు మధుమేహంతో బాధపడే వారికి మంత్రులు మందుల కిట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపరిచిన లెటర్ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ కె శశాంక, డిఎంఅండ్హెచ్ఓ హరీష్ రాజ్, డాక్టర్ రాజేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

——————————————————+
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాద్ చే జారీ చేయనైనది.

Share This Post