రక్త దానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినట్లని సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పేర్కో న్నారు.

రక్త దానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినట్లని సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పేర్కో న్నారు.

గురువారం శ్రీ వివేకానంద యూత్ అసోసియేషన్ మరియు శాంత డెవలపర్స్ సంగారెడ్డి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరైనారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను ఎక్కువగా నిర్వహించి యువకులు రక్తదానం అచేసేలా ఆవగాహన కల్పించాలని అన్నారు.
రెడ్ క్రాస్ సంస్థ రక్తనిధి కేంద్రాలలో రక్త నిలువలు ఉండేలా చూడాలన్నారు.
ఇట్టి రక్తదాన శిబిరంలో 39 మంది దాతలు రక్తదానం చేశారు. రక్త దాతలకు ప్రశంసా పత్రాలు, రెడ్ క్రాస్ మాస్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కే .చందర్, శ్రీమతి జ్యోతి, రక్త దాతలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post