రక్త దానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినట్లని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.

రక్త దానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినట్లని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాలులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్త దానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను నిలపడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. రక్త నిధి కేంద్రాలు , డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రక్తదాన శిబిరాలను ఎక్కువగా నిర్వహించి యువకులు రక్తదానం అచేసేలా ఆవగాహన కల్పించాలని అన్నారు. తలసీమియా వ్యాధి గ్రస్తులు , ప్రమాదాల్లో గాయపడిన వారికీ రక్తం అవసరం ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని రెడ్ క్రాస్ సంస్థలు రక్తనిధి కేంద్రాలలో రక్త నిలువలు ఉండేలా చూడాలని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థకు విరాళాలు , సభ్యత్వం పెరిగేలా కృషి చేయాలని అన్నారు.
కరోనా సమయంలో రెడ్ క్రాస్ సంస్థ బాగా పని చేసిందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. రెడ్ క్రాస్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు , రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు మరియు రంగారెడ్డి జిల్లా అడ్వైసర్ ఈ. వీ శ్రీనివాస రావు , రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు రాఘవ రెడ్డి , అంజి రెడ్డి , డాక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share This Post