రక్త హీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు పైలెట్ ప్రాజెక్టుగా 100 అంగన్వాడీ కేంద్రాల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందచేయుటకు శుక్రవారం వరకు జాబితాను రూపొందించాలని | జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ చాంబర్ నందు చిరుధాన్యాల పంట సాగు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి చిరుధాన్యాలతో కూడిన ఆహారం, ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణపై అవగాహన సదస్సులు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుదాన్యాలతో కూడిన ఆహారం వల్ల కలిగే ఉపయోగాలు గురించి అవగాహనకు 38 ప్రాజెక్టులలో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించినట్లు చెప్పారు. పోషణలోపం లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆయా గ్రామపంచాయతీల్లో తీర్మానంతో పాటు ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. వచ్చే వారం నుండి ఎంపిక చేయబడిన అంగన్వాడీ కేంద్రాల్లో చిరుదాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించుటకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి వారం చిన్నారుల ఎత్తు, బరువును నమోదులు చేయాలని, తదుపరి విడతలు వారిగా అంగన్వాడీ కేంద్రాల్లో చిరుదాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి నెల చిరుధాన్యాల కొరత రాకుండా ప్రతి నెలా స్టాకును అందుబాటులో ఉ ంచేందుకు ప్రొక్యూర్మెంట్ కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. చిరుధాన్యాలు వినియోగానికి ముందు తరువాత మార్పును నిషితంగా గమనించాలని చెప్పారు. ప్రతి బుధవారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో రక్తహీనత కార్యక్రమాలపై అవగాహన కల్పనకు బాలింతలు, గర్భిణిలు, చిన్నారులకు అవగాహన కొరకు సర్పంచుల సహాకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నోట్క్యామ్ యాప్ ద్వారా తీసిన ఫోటోలతో తనకు నివేదికలు అందచేయాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ద్వారా మంచి ఫలితాలను సాధనకు అవకాశం ఉన్నదని చెప్పారు. తప్పనిసరిగా ప్రతి బుధవారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రక్తహీనతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. రక్తహీనతతో బాదపడుతున్న గిరిజన గ్రామాలను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో చిరుదాన్యాల సాగును ప్రోత్సహించేందుకు గ్రామ పంచాయతీల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామ సర్పంచుల సహాకారం తీసుకోవాలని ఆయన సూచించారు. చిరుదాన్యాలను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన యంత్రాలు కొనుగోలుకు అంచనా నివేదికలు అందచేయాలని చెప్పారు. చిరుదాన్యాలతో కూడిన వంటలు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు గురించి ప్రజలకు అవగాహన కల్పనకు పుస్తకాన్ని తయారు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సిడిపిఓ షబానా, వాసన్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సాయినాధ్, చిరుదాన్యాల జిల్లా కో ఆర్డినేటర్ మోహన్, వాసన్ కమ్యూనిటీ రిసోర్స్పర్సన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ద్వారా జారీ చేయబడినది.

 

 

Share This Post