రక్త హీనత రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లాని తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*రక్తహీనత రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తీర్చిదిద్దాలి* : *జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

—————————–
చిన్నారులు , బాలింతలు, గర్భిణీలలో రక్తహీనతను నిర్మూలించి రక్తహీనత రహిత జిల్లా కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
ప్రతి అంగన్వాడీ కార్యకర్త తమ పరిధిలోనిచిన్నారులు , బాలింతలు, గర్భిణీలలో రక్తహీనత లేకుండా చూసినప్పుడే ఇది సాధ్యం అవుతుందన్నారు.
దీన్ని అంగన్వాడీ కార్యకర్తలు చాలెంజ్ గా తీసుకొని కలిసి కట్టుగా , మాస్ మూవ్మెంట్ లాగా చేయాలన్నారు.

బుధవారం సాయంత్రం రక్తహీనతను నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్ లు, సూపర్ వైజర్ లు, mpdo, మండల ప్రత్యేక అధికారులు, mpo ల తో IDOC నుండి వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
నవజాత శిశువులు , గర్భిణులు , బాలింతల్లో రక్తహీనతను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు . వైద్యారోగ్య , ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో గర్భిణుల పేర్లను నమోదు చేసుకొని వారు పౌష్టికాహారం తీసుకునేలా చొరవ చూపాలన్నారు .
2021-2022 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం జిల్లాలో 61 శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని , ప్రతి గర్భిణీ ప్రసవ సమయం వరకు 11 శాతం హెమోగ్లోబిన్ ఉండేలా చూడాలన్నారు . పౌష్టికాహారంలో ఆకుకూరలు , పాలు , గుడ్డు తదితర ఆహార పదార్థాలతో పాటు ఐరన్ ,
మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు . గర్భిణీలు ప్రతీ నెలా తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు చేసుకుని, సర్కారు ఆసుపత్రిలలో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. పిల్లల్లో రక్తహీనత వచ్చే తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన వైద్యం అందించాలన్నారు.
పారిశుద్ధ్యం తో పాటు ఆరోగ్య పరిరక్షణలో పంచాయితీ సెక్రటరీ లది కీలక పాత్ర అని అన్నారు.
ఈ కార్యక్రమాల ను స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపట్టాలని అన్నారు.
బ్రెస్ట్ ఫీడింగ్ , బరువు చూడడం, చిన్నారులు ప్రభుత్వ పరంగా ఇచ్చే అన్ని టీకాల తీసుకునేలా చూడాలన్నారు.

*మన ఊరు మన బడి కార్యక్రమ పనుల గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలి*

అనంతరం జిల్లా కలెక్టర్ మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమం కింద చందుర్తి, వేములవాడ అర్బన్ ,గ్రామీణo, రుద్రంగి మండలాలలో గుర్తించిన పనులకు సంబంధించి ఎస్టిమేట్ జనరెట్ చేసుకున్నారని తెలిపారు.
మిగతా మండలాలలో ఇంకా పెండింగ్ ఉంటే… వెంటనే ఎస్టిమేషన్ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మంజూరు కాబడిన పనులకు సంబంధించి గ్రౌండింగ్ పైన దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు

తదనంతరం జిల్లా కలెక్టర్ దళిత బంధు కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .

ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లోని యూనిట్ లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఇతర లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకునేలా అధికారులకు మార్గదర్శనం చేయాలన్నారు.
లాభదాయక యూనిట్ లను ఎంపిక చేసుకోనే లా…. ఇప్పటికే ఎంపిక చేసుకున్న యూనిట్ లను లాభదాయకంగా మార్చుకోనెలా డిక్కీ కూడా త్వరలోనే ఒక ట్రైనింగ్ సెషన్ దళితబంధు లబ్ధిదారులకు పెట్టనుందని కలెక్టర్ తెలిపారు.

చివరగా జిల్లా కలెక్టర్ హరితహారం కింద నాటిన ఎవెన్యూ ప్లాంటేషన్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .
జిల్లాలో వందశాతం ఎవెన్యూ ప్లాంటేషన్ సర్వైవల్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
85 శాతం కంటే మొక్కల సర్వైవల్ తక్కువ ఉంటే బాధ్యుల పై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
ఎక్కడైనా మొక్కలు చనిపోయినా వాటి స్థానంలో మొక్కలను నాటాలని ఆదేశించారు.
మే నెలలో అధిక వేడిమి దృష్ట్యా
మొక్కలను బ్రతికించు కునేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు .
మొక్కల సంరక్షణ ను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

వర్చువల్ మీటింగ్ లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్, zp ceo శ్రీ గౌతమ్ రెడ్డి, DM &HO సుమన్ మోహన్ రావు, DRDO శ్రీ మదన్ మోహన్, DPO శ్రీ రవీందర్, DWO శ్రీ లక్ష్మి రాజం, ED ఎస్సీ కార్పొరేషన్ శ్రీ వినోద్, PR EE శ్రీ సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

———————————————-

Share This Post