రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన గొప్ప కవి :: జిల్లా కలెక్టర్ జి.రవి
ప్రచురణార్థం…..1 తేదీ.9.9.2021
రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన గొప్ప కవి :: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, 09 సెప్టెంబర్:- రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. గురువారం కాళోజీ నారాయణరావు 108 వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కాలోజి చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో పుట్టి వరంగల్ నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రశ్నించడం ద్వారానే ప్రజల హక్కులు రక్షింపబడతాయని గ్రహించి తెలంగాణ మాండలికంలో తన వందలాది రచనలు ముఖ్యంగా నా గొడవ అలాంటి రచనల ద్వారా సమాజంలో పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ప్రజలకు ప్రశ్నించడం నేర్పి సమసమాజ నిర్మాణానికి బాటలు వేసిన గొప్ప వ్యక్తి కాళోజి అని అంతేకాకుండా పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిదని తెలుపుతూ క్విట్ ఇండియా లాంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి దేశభక్తిని చాటిన గొప్ప దేశభక్తుడని తెలిపారు. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొని తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన తొలి,మలి ఉద్యమాలలో తనదైన పాత్ర పోషించి తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ప్రజల మాటలు, రచనలలో తెలంగాణ మాండలికం ఉన్నంతవరకు ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, జగిత్యాల మరియు కొరుట్ల ఆర్.డి.ఓ.లు కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ, కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల జిల్లా గారిచే జారీ చేయనైనది.
రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన గొప్ప కవి :: జిల్లా కలెక్టర్ జి.రవి
