రబి సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తిచేయాలి – జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీ ఖిమ్యా నాయక్

రబి సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తిచేయాలి  – జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీ ఖిమ్యా నాయక్

రబి సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తిచేయాలి

– జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీ ఖిమ్యా నాయక్

——————————
సిరిసిల్ల 29, ఏప్రిల్ 2022:
——————————
జిల్లాలో ని రైస్ మిల్లర్లు 2020-21 సంవత్సరపు రబీ సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీ ఖిమ్యా నాయక్ మిల్లర్లను ఆదేశించారు.

శుక్రవారం పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) లక్ష్యం మేరకు భారత ఆహార సంస్థ కు అందజేత పై IDOC మీటింగ్ హల్ లో జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ…..

ప్రస్తుత యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు జిల్లాలో ప్రారంభమైనందున మిల్లర్ లు తమ వద్ద ఉన్న ధాన్యం మిల్లింగ్ ను వేగవంతం చేయాలన్నారు.

గత రబి సీజన్ బియ్యాన్ని
సీఎంఆర్‌ పూర్తికి నిర్దేశించిన గడువు ఇప్పటికే ముగిసినందున .. త్వరితగతిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.

సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీ హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post