రబీ సీజన్ లో వచ్చిన సి.ఎం.ఆర్ రైస్ ను (కస్టమ్ మిల్లింగ్ రైస్) మిల్లింగ్ చేసి డిసెంబర్ 31 వరకు 100 శాతం పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేది 08 -12-2021

రబీ సీజన్ లో  వచ్చిన సి.ఎం.ఆర్ రైస్ ను (కస్టమ్ మిల్లింగ్ రైస్)  మిల్లింగ్ చేసి  డిసెంబర్ 31 వరకు 100 శాతం పూర్తి చేయాలని జిల్లా అదనపు  కలెక్టర్  రఘురాం శర్మ తెలిపారు.

బుధ వారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు స్పెషల్ అధికారులు,  రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమవేశం లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఉండే  ప్రతి సెంటర్ నుండి కొనుగోలు జరగాలని,  రైస్ మిల్లులు 24 గంటలు నడపాలని మిల్లర్లకు సూచించారు. ప్రతి రోజు రైస్ ను మిల్లుల నుండి సివిల్ సప్లై గోదాములకు(సి.డబ్లు.సి, ఎన్.డబ్లు.సి) పంపించాలని అన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన ఆర్.ఐ లు  ప్రతి రోజు రైస్ మిల్లులను పర్యవేక్షణ చేసి రోజు వారి టార్గెట్ ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రోజు  కుడా మిల్లులు నడిపించాలని అన్నారు. మీకున్న లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలనీ రైస్ మిల్లర్ల కు ఆదేశించారు.  కలెక్టర్ గారి సమావేశానికి అందరు విదిగా హాజరు కావాలని ఆదేశించారు.  ప్రతి రైస్ మిల్లు యొక్క దాన్యం సేకరణ వివరాలను ,మిల్లులో ఉన్న స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సమావేశం లో డి ఎం ప్రసాద రావు, స్పెషల్ అధికారులు , మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి ద్వారా జారీ చేయడమైనది.

 

 

 

 

 

 

Share This Post