పత్రికా ప్రకటన. తేదీ:21 -01-2022
రబీ సీజన్ లో వచ్చిన సి.ఎం.ఆర్ రైస్ ను (కస్టమ్ మిల్లింగ్ రైస్) మిల్లింగ్ చేసి జనవరి 31 వరకు 100 శాతం పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.
శుక్ర వారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు స్పెషల్ అధికారులు, రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమవేశం లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కు 52000 మెట్రిక్ టన్నుల దాన్యం వచిందని, సి ఎం ఆర్ రైస్ జనవరి 31 వరకు పూర్తి చేయాలనీ, జిల్లా లో ఉండే ప్రతి సెంటర్ నుండి కొనుగోలు జరగాలని, రైస్ మిల్లులు 24 గంటలు నడపాలని మిల్లర్లకు సూచించారు. ఎవరెవరి దగర ఎంత దాన్యం పెండింగ్ ఉందొ తెలుసుకొని మిగిలిపోయిన దాన్యం మొతాన్ని వేరే మిల్లులకు సమానంగా ఇవ్వాలని పౌర సరపరాల అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన ఆర్.ఐ లు ప్రతి రోజు రైస్ మిల్లులను పర్యవేక్షణ చేసి రోజు వారి టార్గెట్ ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిల్లింగ్ చేయని దాన్యాన్ని ఇతర మిల్లులకు పంపిణి చేయాలనీ , ప్రతి రోజు కుడా మిల్లులు నడిపించి మీకున్న లక్ష్యాన్ని జనవరి 31 వరకు పూర్తి చేయాలనీ రైస్ మిల్లర్ల కు ఆదేశించారు. కలెక్టర్ గారి సమావేశానికి అందరు విదిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రతి రైస్ మిల్లు యొక్క దాన్యం సేకరణ వివరాలను ,మిల్లులో ఉన్న స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సమావేశం లో జిల్లా పౌర సరపరాల అధికారి రేవతి, స్పెషల్ అధికారులు , మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారీ చేయడమైనది.