రబీ సీజన్ లో వచ్చిన సి.ఎం.ఆర్ రైస్ ను (కస్టమ్ మిల్లింగ్ రైస్) మిల్లింగ్ చేసి డిసెంబర్ 31 వరకు 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేది 30-11-2021

రబీ సీజన్ లో  వచ్చిన సి.ఎం.ఆర్ రైస్ ను (కస్టమ్ మిల్లింగ్ రైస్)  మిల్లింగ్ చేసి  డిసెంబర్ 31 వరకు 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఆర్.ఐ లు, ఎం.ఆర్.ఐ, లు, ఎన్ఫోర్స్మెంట్ , రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమవేశం లో కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లులు 24 గంటలు నడపాలని మిల్లర్లకు సూచించారు. ప్రతి రోజు రైస్ ను మిల్లుల నుండి సివిల్ సప్లై గోదాములకు(సి.డబ్లు.సి, ఎన్.డబ్లు.సి) పంపించాలని అన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన ఆర్.ఐ లు  ప్రతి రోజు రైస్ మిల్లులను పర్యవేక్షణ చేసి రోజు వారి టార్గెట్ ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రోజు కుడా మిల్లులు నడిపించాలని అన్నారు. రైస్ మిల్లర్లతో మిల్లులో ఉన్న స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్.డి.ఓ రాములు, డి.ఎస్.ఓ రేవతి, డి ఎం ప్రసాద రావు, ఆర్.ఐ లు, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post