రహదారులపై కె.జి. వీల్స్‌తో వాహనాలు నడుపరాదు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలోని రహదారులు, అంతర్గత రోడ్లపై ఎక్కడా కూడా కె.జి. వీల్స్‌తో వాహనాలు నడుపరాదని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. పొలాలతో ఉపయోగించే కె.జి. వీల్స్‌తో వాహనాలు రహదారులపై నడపడం వల్ల రోడ్లు చెడిపోతున్నాయని, వీటిని పొలాలలో మాత్రమే ఉపయోగించాలని, రోడ్లపై నడపరాదని తెలిపారు. ఒకవేళ ఈ చక్రాలతో రహదారులపైకి వచ్చినట్లతే వాహన యజమానులపై కేను నమోదు చేయడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని, ఈ మేరకు నంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

Share This Post