*రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ప్రచురణార్థం-3*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 24: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిరిసిల్ల పట్టణం రగుడు నుండి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వరకు నిర్మిస్తున్న నూతన బైపాస్ రోడ్డు పనుల పురోగతిపై ఆరా తీశారు. 95 కోట్ల వ్యయంతో, 11 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. బీటీ రోడ్డు పనులను రెండు రోజుల్లోగా ప్రారంభించాలని ఆయన అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపెల్లి నుండి అల్మాస్ పూర్ వరకు నిర్మిస్తున్న రోడ్డు వెంబడి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని సెస్ అధికారులను ఆదేశించారు. శాభాష్ పల్లి 4 వరుసల వంతెన చుట్టూ ఒక కోటి రూపాయల వ్యయంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. వేములవాడ పట్టణం మూలవాగు మీద నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జ్ వచ్చే జనవరి చివరి కల్లా పూర్తి స్థాయిలో నిర్మించాలని ఆదేశించారు. వేములవాడ బైపాస్ రోడ్డుకు సంబంధించి మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి జాయింట్ రిపోర్ట్ అందించాలని కలెక్టర్ తెలిపారు. చందుర్తి నుండి మోత్కురావుపేట వరకు 19 కోట్ల 75 లక్షల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో వేగం పెంచాలని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 6 కిలోమీటర్లకు పైగా రోడ్డు నిర్మాణం పూర్తయిందని, మిగిలిన రోడ్డు నిర్మించడానికి తగిన చర్యలు చేపడుతామని కలెక్టర్ కు అధికారులు వివరించారు. జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఎక్కడా కూడా క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఎస్టీ వెల్ఫేర్ పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, ఇతర నిర్మాణాలలో వేగం పెంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, ఆర్&బి ఈఈ కిషన్ రావు, మిషన్ భగీరథ ఈఈ లు విజయ్ కుమార్, జానకి, సెస్ ఎండీ రామకృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post