రహదారుల పునరుద్ధరణ నిర్మాణాలు, సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పీ.ఉదయ్ కుమార్

జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, అసంపూర్తిగా ఉన్న రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ పీ ఉదయ్ కుమార్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, భూసేకరణ, ఇతర అంశాలపై గురువారం తన ఛాంబరులో రోడ్లు భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
కల్వకుర్తి – ఆంధ్రప్రదేశ్ కరివేన వరకు మంజూరైన 160 కిలోమీటర్ల జాతీయ రహదారి, జిల్లా రోడ్లు భవనాల శాఖ పరిధిలోని జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న 62 రహదారుల 461 కిలోమీటర్ల నిర్మాణం, వాటి ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్ అధికారులతో ఆరా తీశారు.
శాఖాపరమైన సమీక్ష హాజరయ్యే ప్రగతి నివేదికలో ఏ మేరకు పని జరిగింది..! మంజూరైన నిధులు ఎన్ని..? ఖర్చు చేసిన నిధులు ఎన్ని ఇంకా చేయవలసిన పని ఎంత మిగిలి ఉందో అనే అంశాల వారీగా నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు.
జిల్లాలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, రహదారులకు నివేదికలు సమర్పించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్ అండ్ బి పరిధిలోని రోడ్ల వివరాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
రహదారి నిర్మాణంలో మొక్కలు వేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణా పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ఈఈ జి. భాస్కర్, నాగర్ కర్నూల్, అచంపేట్ డీఈలు రమాదేవి, నాగలక్ష్మి పాల్గొన్నారు.

Share This Post