రాఖీ పౌర్ణమి వేడుకలు : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన
12.8.2022
 వనపర్తి
       మహిళలు అన్ని రంగాలలో రాణిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
       శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు, యువతులు మంత్రికి రాఖీ కట్టి మంత్రి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి పెరిగితేనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారని ఇంకా అభివృద్ధి సాధించాలని ఆయన తెలిపారు. రాఖీ పౌర్ణమి రోజున అక్క, చెల్లెళ్లను అభినందించడంతో పాటు ప్రతి మహిళను గౌరవించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాఖీ కట్టిన మహిళలకు మంత్రి మిఠాయిలు అందజేశారు.
     ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ. పుష్పలత, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post