రాజకీయాలకతీతంగా CMRF చెక్కులు, పేదల వైద్య సేవలకు ఆర్థిక బోరోస : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

తేదీ.7.11.21.
సూర్యాపేట.

రాజకీయాలకతీతంగా CMRF చెక్కులు

*పేదల వైద్య సేవలకు ఆర్థిక బోరోస.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

పేదల వైద్య సేవలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లలో 69 మంది లబ్ధిదారులకు రూ. 70 లక్షల విలువగల CMRF చెక్కులు అందజేత అందచేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

తెలంగాణ లో గత ఏడేళ్లుగా రాజకీయలకతీతంగా CMRF చెక్కులు అందజేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 69 మంది లబ్ధిదారులకు సుమారు 70 లక్షల విలువగల CMRF చెక్కులు అందజేసి మాట్లాడారు. ఎలాంటి వివక్ష చూపకుండా అన్నిరంగాలకు సమ ప్రధాన్యతనిస్తూ చేయూత నందిస్తున్న అన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిచేకూరుతుందన్నారు. అంతేకాకుండా గతంలో ఈ చిన్న సమస్య ఉన్నా ఫైరవీ కారుల ఇబ్బందులే ఎక్కువగా వుండేవన్నారు. ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా ప్రజలే నేరుగా తమ సమస్య పరిష్కారానికి విన్నవించుకునే స్వాతంత్రం ఉందనే మాట ప్రజల నోట వింటుంటే గర్వంగా వుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులతో పేద కుటుంబాలకు ఆర్థిక భారంతో అప్పుల బాధలు లేకుండా కొండంత అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థచైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, ZP వైస్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ పుట్ట, MPP నెమ్మది, ZPTC లు జీడి బిక్షం, మామిడి అనిత అంజయ్య లతో పాటు నియోజక వర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Share This Post