రాజనగరం సమీపంలోని అమ్మ చెరువులో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

పత్రికా ప్రకటన తేది:12.9.2021,
వనపర్తి.

వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా, మూడవ రోజు నుండి కొనసాగనున్న వినాయక నిమజ్జనం వనపర్తి శివారులోని రాజనగరం దగ్గర ఉన్న అమ్మ చెరువు వద్ద ఏర్పాట్లు చేశామని, భక్తులు అమ్మ చెరువులో నిమజ్జనం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నల్ల చెరువు దగ్గర వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రస్తుతం అక్కడ సుందరీకరణ పనులు చేపట్టినందున ఈ సంవత్స రం రాజనగరం సమీపంలో ఉన్న అమ్మ చెరువులో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.
వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో డి.ఎస్.పి. కిరణ్ కుమార్, సీ.ఐ. ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
……………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post