రాజన్న ఆలయంలో పరిసర ప్రాంతాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకొంటున్న చర్యలను ఆలయ ఈఓ తో కలసి పరిశీలించిన జెడ్పి సీఈఓ గౌతమ్ రెడ్డి

ప్రచురణార్థం-5
రాజన్న సిరిసిల్ల, జనవరి 18: మేడారం సమ్మక-సారాలమ్మ జాతర కు వెళ్లే ముందు వేములవాడ రాజన్న ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున కోవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రాజన్న అలయంలో చేపట్టిన సానిటైజర్, మాస్కుల పంపిణి లాంటి చర్యలను ఆలయ ఈఓ రమాదేవి తో కలిసి జెడ్పి సీఈఓ గౌతమ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లోని సమావేశ మందిరంలో ఆలయ ఈఓ తో కలసి ఆలయ ఇంజనీరింగ్, పరిపాలనా విభాగం, శానిటేషన్ అధికారులతో సీఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనల ప్రకారం ఆలయంలోకి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు మాస్క్ ధరించేలా చూడాలని, ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద సానిటీజర్ లు స్టాండ్ తో సహా అందుబాటులో ఉండేట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించు విషయమై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. తప్పనిసరిగా ప్రతి భక్తుడు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మాస్కులు లేకపోతే లోపలికి అనుమతించకూదని అధికారులకు సూచించారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. వేములవాడ బస్టాండ్, అలాగే వాహనాల పార్కింగ్ స్థలాల్లో మాస్కుల పంపిణి , సానిటీజర్ల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ పరిసర ప్రాంతాలయిన ధర్మ దర్శనామ్ క్యూ లైన్, కోడె క్యూలైన్, ఈఓ కార్యాలయం, పార్కింగ్ స్థలం, తిప్పాపూర్ బస్ స్టాండ్, రెండు కళ్యాణకట్టల వద్ద, తదితర 13 చోట్ల సానిటీజర్ స్టాండ్లు,13 చోట్ల థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు, 5 చోట్ల మాస్క్ ల పంపిణీ ఏర్పాట్లు చేశామన్నారు. 26 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి కోవిడ్ నియంత్రణకై తగిన ఏర్పాటు చేస్తునట్లుగా తెలిజేశారు.
ఈ సమీక్షలో ఆలయ ఈఓ ఎల్. రమాదేవి, మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, ఏఈఓ లు హరికిషన్, జయకుమారి, బి. శ్రీనివాస్, పి. నవీన్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, అరుణ్, గోలి శ్రీనివాస్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post