రాజన్న సిరిసిల్ల దళిత బంధు లబ్దిదారులు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శనంగా, ఉదాహరణగా నిలవాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*రాజన్న సిరిసిల్ల దళితబంధు లబ్ధిదారులు* *తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా,* *ఉదాహరణ గా నిలవాలి*

– వచ్చే సంవత్సరం ఎంపిక చేసే లబ్దిదారులకు శిక్షణ ఇచ్చే స్థాయికి మొదటి దశ లబ్దిదారులు ఎదగాలి

– *జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

——————————

– కే టి ఆర్ కు ఇచ్చిన హామీ మేరకు రాజన్న సిరిసిల్ల ను డిక్కీ అడాప్ట్ చేసుకుంటుంది

– శిక్షణ కార్యక్రమాలలో దళిత బంధు లబ్ధిదారులను సక్సస్ పుల్ వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతాం

-పద్మశ్రీ అవార్డు గ్రహీత, డిక్కీ(Dalit Indian Chamber of Commerce and Industry) జాతీయ ప్రెసిడెంట్ నర్రా రవి కుమార్
——————————
దళితబంధు పథకం అమలులో రాజన్న సిరిసిల్ల జిల్లా లబ్దిదారులు తెలంగాణ రాష్ర్టానికే ఆదర్శంగా, ఉదాహరణ గా నిలువాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ఆకాంక్షించారు.

దళితుల కోసం వ్యాపార సంస్థలను ప్రోత్సహించే
దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( DICCI – డిక్కీ ) ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా లో దళిత బంధు పథకం కింద మొదటి విడుతలో ఎంపిక చేసిన 205 లబ్ధిదారులతో శుక్రవారం IDOC కాన్ఫరెన్స్ హల్ లో సమావేశం నిర్వహించారు.
ముఖ్యుల ప్రసంగాల అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ యూనిట్ ల స్థాపన పై డిక్కీ ప్రతినిధులు లబ్దిదారులకు అవగాహన కల్పించారు.

 

సీఎం కేసీఆర్‌ దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.  వచ్చిన డబ్బులతో లబ్ధిదారులు శాశ్వత ఉపాధి లభించే మార్గాలను ఎంచుకోవాలన్నారు.
ఉమ్మడి గా లాభదాయక వినూత్న యూనిట్ లను పెట్టాలను కుంటే దళిత బంధు డబ్బులు ఇంకా అదనంగా డబ్బులు కావాలనుకుంటే టి- ప్రైడ్ ద్వారా ప్రభుత్వం అందిస్తుందన్నారు. బ్యాంకులు కూడా రుణ సహాయం అందజేస్తాయని తెలిపారు.

నచ్చిన యూనిట్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్న, అందరూ ఒకే విధమైన యూనిట్లు పెట్టుకోవద్దని, మారుతున్న పరిస్థితులను గమనించాలని సూచించారు.
ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో యూనిట్ లను ఎంపిక చేసుకుంటే వాటి విలువ తగ్గుతుందన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.
వచ్చే సంవత్సరం ఎంపిక చేసే లబ్దిదారులకు శిక్షణ ఇచ్చే స్థాయికి మొదటి దశ లబ్దిదారులు ఎదగాలన్నారు .
ప్రతి ఒక్కరి ఖాతాలో దళిత బంధు డబ్బులు రూ.9.9 లక్షలకు జమ చేస్తామని తెలిపారు.
జిల్లా యంత్రాంగం లబ్దిదారులకు కావాల్సిన తోడ్పాటును అందిస్తుందని … ఈ స్కీం మీ పిల్లలు, ఊరు బాగుపడెలా చూడాలన్నారు.
డిక్కీ సంస్థ యూనిట్ ల గ్రౌండింగ్ తో పాటు ఫైనాన్స్ , మార్కెటింగ్ సౌకర్యం వరకు సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. దళితులు ఆత్మగౌరవంతో బతికినప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందన్నారు.  దళిత బంధు లబ్దిదారులను సంపద, ఉద్యోగలా సృష్టికర్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డిక్కీ(Dalit Indian Chamber of Commerce and Industry) జాతీయ ప్రెసిడెంట్ నర్రా రవి కుమార్ మాట్లాడుతూ…

మీ జీవితాల్లో సానుకూల మార్పులు , సాధికారత రావాలని ఆలోచిస్తూ, దళిత బందును సిఎం శ్రీ కేసిఆర్, మంత్రి కేటీఆర్ లు ఈ పథకం ను ప్రవేశ పెట్టారని చెప్పారు.
రూ. 10 లక్షలు అందించడం ద్వారా స్వయం పోషకులు గా ఎదగాలని వారి కోరిక అని అన్నారు
ప్రభుత్వం ఇస్తున్న ఈ నగదు లబ్ధిదారులు తమ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఆర్ధిక క్రమశిక్షణతో ఈ నగదు వాడుకోవాలన్నారు . ప్రభుత్వం పూర్తి గ్రాంట్ తో ఇస్తున్న ఈ నగదును ఏవిధంగా వినియోగించుకోవాలో, దళితులకు సంబంధించిన ఇతర పథకాలపై రవి కుమార్ వివరించారు. ప్రతి వ్యక్తిలో వ్యాపార లక్షణాలు ఉంటాయని కొద్ది పాటి శిక్షణ అందిస్తే సక్సెస్ పుల్ వ్యాపార వేత్తలు గా రాణిస్తారనీ అన్నారు.
జిల్లాలోని లబ్దిదారులు ఏ వ్యాపారం పెట్టాలో తెలియని అయోమయంలో ఉన్నారని అన్నారు. గతంలో దళితులు వ్యాపారం నిర్వహించిన అనుభవం లేకపోవడమే ఇందుకు కారణం అన్నారు.
జిల్లాలోని దళిత బంధు లబ్దిదారులకు గ్రూప్ లుగా విభజించి చేపట్టాల్సిన వ్యాపారాల పై అవగాహన ఇచ్చే వరకు డిక్కీ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.
తపన , కృషి ఉంటే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించ వచ్చునని తెలిపారు.

 

డిక్కీ రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అరుణ మాట్లాడుతూ….
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు అందించడం మీ అదృష్టమని తెలిపారు. ఇచ్చే గ్రాంట్ తో ఏ వ్యాపారం పెట్టాలో సరైన నిర్ణయం తీసుకుని మీ, మీ పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేయాలన్నారు. మనమెంటో నిరూపించాలంటేఆర్థికంగా బలపడాలని అన్నారు . తపన, సరైన ప్రణాళిక ఉంటే ప్రతి ఒక్కరూ.. సక్సెస్ పుల్ బిజినెస్ పర్సన్ కావొచ్చని అన్నారు.

——————————
*మా అప్పుడు కేసిఆర్ లేకుండే…*
*స్వంత తల్లి తండ్రులు రూ.10 లక్షలు ఇవ్వలే*
:పద్మశ్రీ అవార్డు గ్రహీత, డిక్కీ జాతీయ ప్రెసిడెంట్ నర్రా రవి కుమార్

——————————
మాకు అప్పుడు కేసీఆర్ లేకుండే….
ఎంతో కష్టపడి, స్వయంకృషి ,తపన , పట్టుదల తో ఒక్కో మెట్టు ఎక్కతూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇప్పుడు 5 సక్సెస్ పుల్ వ్యాపార కంపెనీ లకు సీఈఓ ఉన్నాను.

పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలో చావడం మన తప్పే.
మన సొంత తల్లిదండ్రులు కూడా మనకు 10 లక్షలు ఎన్నడు ఇవ్వలే. జీవితంలో మార్పు రావాలి.
కెసిఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ పుల్ వ్యాపార వేత్తలు గా, ఉద్యోగ సృష్టి కర్త లుగా రాణించి సీఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలే అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, డిక్కీ(Dalit Indian Chamber of Commerce and Industry) జాతీయ ప్రెసిడెంట్ నర్రా రవి కుమార్
అన్నారు.

అనంతరం డిక్కీ ప్రతినిధులు లాభదాయక యూనిట్ ల గురించి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లబ్దిదారులకు వివరించారు.

ప్రధానంగా మండల కేంద్రాలలో మినీ థియేటర్ ల నిర్మాణం, చెత్తతో సంపద సృష్టి, పెంపుడు కుక్కలకు వైద్య సేవలు, పుడ్ పునరుత్పత్తి సాంకేతికత, పత్తి వత్తుల, అగరు బత్తుల తయారీ, వ్యవసాయంలో డ్రోన్ వినియోగం తదితర యూనిట్ ల స్థాపన , మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాల ను వివరించారు. ఈ సందర్భంగా
లబ్ధిదారులు లేవెనెత్తిన సందేశాలను నివృత్తి చేశారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ , డిక్కీ జాతీయ ఉపాధ్యక్షులు సంజీవ్, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు వినోద్, drdo మదన్ మోహన్, డిక్కీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post