రాజీమార్గమే రాజమార్గం
జిల్లా రెండవ అదనపు జడ్జి ఎం. వాణి
0 0 0 0
రాజీ మార్గమే రాజమార్గమని కోర్టుల చుట్టు తిరగడం కన్న , కక్షిదారులు ఇరువురు రాజీపడితే సమస్యను సత్వరంగా పరిష్కరించుకో గలుగుతారని జిల్లా రెండవ అదనపు జడ్జి ఎం. వాణి అన్నారు.
శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ న్యాయం కోసం కక్షిదారులు ఎళ్లతరబడి కోర్టుల చుట్టు తిరగకుండా కేసులను సత్వరమే పరిష్కరించే దిశగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు. ఈ సదవకాశాన్ని కక్షిదారులు సద్వీనియోగం చేసుకొని కేసులను పరిష్కరించు కోవాలని అన్నారు. కోర్టులలో నడిచే కేసులపై ఒక్కరు మాత్రమే గెలుపొందుతారని, కాని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటే ఇరువర్గాల కక్షిదారులు గెలుపొందుతారని అన్నారు. కోర్టులో ఒడిపోతే మల్లి అప్పిల్ కు వెళ్లే అవకాశం ఉంటుందని, కాని జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీపడితే తిరిగి అప్పిల్ ఉండకుండా అక్కడిక్కడే కేసును కొట్టివేయడం జరుగుతుందని పేర్కోన్నారు. కోర్టులలో నడిచే కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నట్లయితే, కోర్టు ఫీజలను కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుందని పేర్కోన్నారు. కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేవిధంగా ప్రతిఒక్కరు ప్రతినభూనాలని అన్నారు.
బార్ అసోసియోషన్ ప్రెసిడెంట్ ఎర్రం రాజిరెడ్డి మాట్లాడుతూ కేసుల పరిష్కారంపై ప్రజాన్యాయస్థానం న్యాయమూర్తులు కోర్టు పరిదిని దాటి మనవద్దకు వచ్చి కేసులను పరిష్కరిస్తారని. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కోర్టులలో న్యాయంకోసం 100 సంవత్సరాలుగా వేచిచూస్తున్న కేసులను కూడా పరిష్కరించుకునే అవశాం ఉందని అన్నారు. ప్రతి 3నెలలకు ఒకసారి జరిగే జాతీయాలు లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కక్షిదారులకు అమోదయోగ్యమైన న్యాయాన్ని వెంటనే అందించడం జరుగుతుందని అన్నారు. కేసులపై రాజిపడితే ఇరువురు గెలుస్తారని, లేకపోతే ఒక్కరు మాత్రమే గెలుస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ, అడిషనల్ డిసిపి మదన్ లాల్, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సుజయ్, కక్షిదారులు పాల్గోన్నారు.