రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ రెండవ ఓపెన్ ప్లాట్ లు,గృహాల వేలం పై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో మే 31 న మొదటి ప్రీ బిడ్ సమావేశం:స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు 253,గృహాలు 363 రెండవ విడత భౌతిక వేలం పై మొదటి “‘ ప్రీ బిడ్”” సమావేశం ఈ నెల(మే) 31 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటన లో తెలిపారు.నార్కట్ పల్లి మండలం ఎల్లా రెడ్డి గూడ గ్రామం లో రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ లో 253 ఓపెన్ ప్లాట్లను,363 గృహాలను వివిధ విస్తీర్ణం లలో ఉన్న వాటిని భౌతిక వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశం అని,ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్ల ను స్వంతం చేసుకోవాలనే ప్రజలు ప్రీ బిడ్ సమావేశం కు హాజరు కావాలని,ఈ సమావేశం లో ఓపెన్ ప్లాట్ల,గృహాల వేలం ద్వారా విక్రయం పై అవగాహన కలిగించ నున్నట్లు ఆయన ఈ ప్రకటన లో తెలిపారు.

Share This Post