*రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ లో ఓపెన్ ప్లాట్ లు ఈ ఆక్షన్ ద్వారా విక్రయం కు ముమ్మర ఏర్పాట్లు*

నార్కట్ పల్లి(దాసరి గూడెం),జనవరి 27. నార్కట్ పల్లి మండలం దాసరి గూడెం జి.పి.పరిధి లో రాజీవ్ స్వగృహ ద్వారా ఏర్పాటు చేసిన శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లు,గృహ నిర్మాణాలు ప్రభుత్వ ఆదేశాల ననుసరించి హెచ్.యం.డి.ఏ ఆధ్వర్యంలో ఈ ఆక్షన్ ద్వారా విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా  ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్  అధికారులు,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ,ఎం.పి.డి.ఓ.,,తహశీల్దార్ లతో కలిసి శ్రీ వల్లి టౌన్ షిప్ ను సందర్శించి ప్లాట్ లు ఈ ఆక్షన్ ద్వారా విక్రయం చేయుటకు లెవెలింగ్,విభజించిన ప్లాట్ లకు హద్దులు ఏర్పాటు చేయుటకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఓపెన్ ప్లాట్ ఏరియా ను లెవెలింగ్ చేయాలని పి .ఆర్. డి.ఈ. ని కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా నక్ష ప్రకారం క్షేత్ర స్థాయి లో ఓపెన్ ప్లాట్ ల విస్తీర్ణం నంబరింగ్ ఉండాలని,ప్రస్తుతం 4 బ్లాక్ లలో ఉన్న ప్లాట్ లకు హద్దులు ఏర్పాటు,నంబరింగ్ చేయాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.శ్రీ వల్లి టౌన్ షిప్ లో259 నిర్మాణం చేసిన ఇండ్లు,574 ఓపెన్ ప్లాట్ లు మొత్తం 833 ప్లాటింగ్ చేసి నంబరింగ్ చేయాలని ఆదేశించారు.ఇందుకు 4 బ్లాక్ లలో 4 టీమ్ లను ఏర్పాటు చేయాలని,ఒక్కొక్క టీమ్ లో ఒక సర్వేయర్, హెల్పర్,ఇద్దరు లేదా ముగ్గురు లేబర్ ఏర్పాటు చేసి వారం రోజుల్లో హద్దులు ఏర్పాటు,నంబరింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏం పి.డి.ఓ.,తహశీల్దార్ ప్రతి రోజు సందర్శించి పనులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.          టౌన్ షిప్ నుండి గ్రామంకు కలిపేలా రహదారులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టౌన్ షిప్ లో సైట్ కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుందని,ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హెచ్.యం.డి.ఏ ద్వారా ధర నిర్ణయించి పారదర్శకంగా ఈ ఆక్షన్ వేయనున్నట్లు,ప్రపంచం లో ఎక్కడ నుండి అయినా ఈ ఆక్షన్ ద్వారా కొనుగోలు చేసుకో వచ్చని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంట సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.శ్రీనివాస్,పంచాయతి రాజ్ ఈ ఈ తిరుపతయ్య,డి.ఈ. నాగయ్య, ఎం.పి.డి.ఓ.,తహశీల్దార్ లు ఉన్నారు.

*రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ లో ఓపెన్ ప్లాట్ లు ఈ ఆక్షన్ ద్వారా విక్రయం కు ముమ్మర ఏర్పాట్లు*

Share This Post