రాజీవ్ స్వగృహ స్థలాల  ప్లాటింగ్ పనులను వేగవంతం చేయాలి: అదనపు  కలెక్టర్ గరిమ అగర్వాల్

రాజీవ్ స్వగృహ స్థలాల  ప్లాటింగ్ పనులను వేగవంతం చేయాలి

అదనపు  కలెక్టర్ గరిమ అగర్వాల్

00000

రాజీవ్ స్వగృహ స్థలాల  ప్లాటింగ్ పనులను వేగవంతం చేయాలని  అదనపు  కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  రాజీవ్ స్వగృహ అంగారక టౌన్ షిప్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు  కలెక్టర్  మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్  గ్రామం లోని రాజీవ్ స్వగృహ అంగారక టౌన్ షిప్ లోని స్థలాలను చదును, సర్వేయర్ లతో మ్యాపింగ్ చేసి ప్లాటింగ్ హద్దురాళ్ళ ను  ఏర్పాటు చేసి  కలరింగ్ చేయాలని అన్నారు.  పెద్ద ప్లెక్సీ లో చాటింగ్ మ్యాప్ ను ఏర్పాటు చేసి  ఆమర్చలన్నారు.

ఈ సమావేశంలో రాజీవ్ స్వగృహ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్ డి ఓ ఆనంద్ కుమార్  అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే అశోక్ కుమార్, తిమ్మాపూర్ తహసిల్దార్ రాజ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.

Share This Post