రాజీవ్ స్వగృహ స్థల నోటిఫికేషన్ విడుదల చేయాలి :: జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

రాజీవ్ స్వగృహ స్థల నోటిఫికేషన్ విడుదల చేయాలి ::
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
00000

తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని 87 ఎకరాల రాజీవ్ స్వగృహ స్థలం అమ్మకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని రాజీవ్ స్వగృహ కు చెందిన 87ఎకరాల స్థలం అమ్మకానికి నోటిఫికేషన్ జారీచేయాలని మరియు జంగల్ క్లీయర్ చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేయాలని విసి సుడా ను కలెక్టర్ ఆదేశించారు. స్థలం లేఅవుట్ తయారు చేసి మార్కెట్ రెట్లు వెంటనే నిర్ణయించాలని దీనికి సంబంధించి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని వెబ్ సైట్ ను 29.05.2022 నుండి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలొ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, కరీంనగర్ ఆర్డిఓ అనంద్ కుమార్, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, డిఈ సుడా, హె.ఎమ్.డి.ఏ, ఆర్.ఎస్.ఏ లు, కలక్టరేట్ సూపరింటెండెంట్ లు తదితరులు పాల్గోన్నారు.

Share This Post