రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు

రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. యుపిఎ ప్రభుత్వంలో నాటి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో ఆస్కార్ ఫెర్నాండెజ్ రోడ్డు రవాణా & హైవే మరియు కార్మిక, ఉపాధికల్పన శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు.తొలి యుపిఎ ప్రభుత్వంలోని క్యాబినెట్ లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు గొప్పవన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Share This Post