*రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, నవంబరు 26: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు- విధులపై ప్రజలందరికీ విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్ జయంతి అన్నారు. 72 వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 1949 నవంబరు 26న భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుం టున్నామని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు. అన్ని వ్యవస్థలకూ బాధ్యతలు, అధికారాలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో రాజ్యాంగం నిర్దేశించిందన్నారు. రాజ్యాంగాన్ని తీర్చిదిద్ది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగం అత్యున్నత చట్టంగా మారడంతో పాటు కుల, మత, లింగ, వర్గభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు లభించాయన్నారు. కార్యక్రమంలో భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందిస్తామంటూ అధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్ర మంలో ఏఓ గంగయ్య, విభాగాల పర్యవేక్షకులు శ్రీకాంత్, రామకృష్ణ, రవికాంత్, సుజాత, రమేష్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post