రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 72వ రాజ్యాంగ దినొత్సవం పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాల వేశారు. అనంతరం రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞ అందరితో అదనపు కలెక్టర్ చేయించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని, సేవలను తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సంవిధాన్ దివాస్ తో పాటు జన్ భాగీదారి కార్యక్రమాన్నీ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ. కిరణ్ ప్రకాష్, పర్యవేక్షకులు, ఐడిఓసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post