రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలి…

ప్రచురణార్థం

రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలి…

మహబూబాబాద్ నవంబర్ 26.

ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరములు పూర్తిచేసుకున్న శుభసందర్భంలో లో ఆజాద్ అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నామని అందులో భాగంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న మన్నారు.

స్వాతంత్ర్యం సాధించుకున్న తదనంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునే ఎందుకు ప్రపంచ దేశాల లోని రాజ్యాంగం పరిశీలించు కుంటూ భారతదేశం న్యాయం ధర్మం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే విధంగా ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ముందుకు పోతున్న మన్నారు.
ఇటువంటి మహత్తర మైన రోజును మనం ఎన్నటికీ మరువరాదు అని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇచ్చిన రాజ్యాంగం కు అందరం రుణపడి ఉన్నాము అన్నారు.

భారత రాజ్యాంగ విశిష్టత ప్రతి ఒక్కరు కి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగానికి అందరూ సమానం అని స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రతి ఒక్కరివి అని తెలియజెప్పారు.
వాటిని కాపాడుకుంటూ న్యాయం ధర్మం పాటించాలన్నారు. ఇదే రోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్ కొమరయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ జారీ చేయడమైనది

Share This Post