రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి , గొప్ప మేధావి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిశంబర్ 6: రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న, డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ 65 వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలోని డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి , గొప్ప మేధావని కలెక్టర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సంక్షేమ శాఖ అధికారి కె. భాస్కర్ రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ ఇడి ఏ. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post