రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి – జిల్లా కలెక్టర్ హరీష్

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి – జిల్లా కలెక్టర్ హరీష్

అందరికి సమన్యాయం అందించాలని ప్రపంచంలోనే అతి పెద్ద భారత రాజ్యాంగం లిఖించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ కొనియాడారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ వర్థంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి ఆయన చిత్రపటనానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలనకు అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా కొనియాడబడుతున్న వారి మహోన్నత ఆశలు, ఆశయాలకనుగుణంగా మనం ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా కోశాధికారి చిన్న సాయిలు, బి.సి. అభివృద్ధి అధికారి జగదీశ్, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post