రాజ్యాంగ హక్కుల రక్షణ బాధ్యత అందరిది – కలెక్టర్

భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని
భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఒకేసారి స్వాతంత్రం పొందినా భారతదేశం పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు అనేక రంగాలలో ముందుంది అన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశం మనదని, అంత మంది ఓటర్స్ తో సాధారణ ఎన్నికలు ఎంతో సులభంగా ప్రశాంతంగా పూర్తి చేస్తున్నామన్నారు.
అందుకు మన రాజ్యాంగమే కారణమని,
రాజ్యాంగాన్ని రచించిన
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని, సేవలను తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
వారు అందించిన ఈ ఫలాలే ఈరోజు దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

సువిశాలమైన భారత దేశంలో ఎన్నో భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా బేధాభిప్రాయాలు లేకుండా
భారతదేశం ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని రకాల వ్యవస్థలు సిస్టమేటిక్ గా పని చేస్తూ ప్రజల యొక్క సంస్కరణల కోసం అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నదంటే దానికి వెనకాల రాజ్యాంగం, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ యొక్క దూరదృష్టి,
రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తున్న యంత్రాంగాలు కారణమని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన విలువలు, హక్కులను కాపాడే బాధ్యత మన అందరిపై ఉన్నదని, తప్పకుండా చేసే ప్రతి పనిలో ఆ అంశాన్ని గుర్తు పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, టీఎన్జీవోస్ అధ్యక్షులు అలుక కిషన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post