రానున్న కోవిడ్ ముప్పును అరికట్టెందుకు ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేసి 100 శాంతం లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు.

రానున్న కోవిడ్ ముప్పును అరికట్టెందుకు ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేసి 100 శాంతం లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు.

రానున్న కోవిడ్ ముప్పును అరికట్టెందుకు ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేసి 100 శాంతం లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి గూగుల్ మీట్ ద్వారా వాక్సినేషన్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2వ విడత డోజ్ మిగిలిపోయిన మొదటి డోజ్ వాక్సినేషన్ ను 15 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. జడ్పీ సీఈఓ, డీపీవో, డిఆర్డిఓ, వైద్య అధికారులు పూర్తి బాధ్యత వహించి గ్రామాలలో ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అయ్యేలా చూడాలన్నారు. వాక్సినేషనకు ముందు గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో టామ్ టామ్ వేయంచాలన్నారు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయాలలో వాక్సినేటర్ లను వాహనాలలో తీసుకొని వెళ్లి వాక్సినేషన్ చేయించాలని తెలిపారు. 2వ డోజ్ కు సంబంధించి వైద్య అధికారులతో సమాచారం సేకరించుకొని ఆశా, విఆర్ఓ, విఆర్ఏ, గ్రామ కార్యదర్శులతో ప్రతిరోజు సాయంత్రం 4:00 గంటల నుండి 6:00 గంటల వరకు అందుబాటులో ఉన్నవారందరికీ వాక్సినేషన్ చేయాలన్నారు. వాక్సినేషన్ పై ప్రతిరోజు సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని ఈ సందర్బంగా కలెక్టర్ హెచ్చరించారు. ఈరోజు నుండి 2వ డోజ్ వాక్సినేషన్ రెండు రోజులలో పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు మొదటి డోజ్ వేసుకొని వారిని గుర్తించి వారం రోజులలో 100 శాంతం లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు.

హరితహారం :-

రాబోవు వర్షాకాలంలో 7వ మరియు 8వ విడత హరితహారంకు సంబంధించిన శాఖల వారిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అందరు జిల్లా అధికారులతో హరితహారం 2022-23, 2023-24 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈసారి జిల్లాలో డిఫరెంట్ గా హరితహారం నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా R&B, పంచాయతీ రాజ్ ప్రధాన రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద మొత్తంలో చేపట్టి పచ్చదనం ఉట్టిపడేలా చేయాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండల వ్యవసాయ అధికారికి 20 ఎకరాల చొప్పున రైతు పొలాల వద్ద మొక్కలు నాటే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పాఠశాలలు, రైతు పొలాలు, పరిశ్రమిక వడలు, రోడ్లకు ఇరువైపులా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు శాఖల వారిగా లక్ష్యాలను 15 రోజులలో సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పక్కన నాటే ప్రతి మొక్కకు ట్రీగార్డ్ లు ఏర్పాటు చేసి రక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, DFO వేణుమాధవ్, DRDO కృష్ణన్, DEO రేణుకదేవి, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, dmho తుకారం, స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post