రానున్న రోజుల్లో క్రికేట్ స్టేడియం ఏర్పాటు కు కృషి
ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
0 0 0 0
క్రీడలను మరింత ప్రోత్సహించే దిశగా జిల్లాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు కృషిచేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
బుదవారం సాయంత్రం అంబేడ్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ అద్వర్యంలో నిర్వహించిన బాలబాలికలకు ఉచిత వేసవి క్రీడల శిక్షణ ముగింపు ఉత్సవాలలో ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. అభివృద్ది దిశగా పరుగులిడుతున్న తెలంగాణలొ నేటి బాలల బంగారు భవిష్యత్తును సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సాధించుకొని నీటి ఎద్దడి లేని రాష్ట్రాన్ని సాకారం చేసే దిశగా కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణం, పాలమురు ఎత్తపోతల పథకం, 24 గంటల కరెంటు వంటి అద్బుతమైన పథకాలను విజయవంతంగా ప్రవేశపెట్టుకోవడం జరిగిందని అన్నారు. స్మార్ట్ సిటి దిశగా జిల్లాలో కేబుల్ బ్రిడ్జీ, మానేరురివర్ ఫ్రంట్, 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. 9వసంతాలను విజయవంతంగా పూర్తిచేసుకోని అంగరంగవైభవంగా 10 దశాబ్దంలోని అడుగిడుతున్న శుభసంద్బంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను గురించి రేపటి తరానికి వివరించాలనే సంకల్పంతో జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థులకు లక్ష్మిపూర్ గాయత్రి పంప్ హౌజ్, భూగర్భ పంప్ హౌజ్ లను చూపించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ సేవా ఇస్లావత్, ట్రైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, గ్రందాలయ చైర్మన్ పోన్నం అనీల్ కమార్, స్పోర్ట్ అధికారి రాజవీర్ ఇతర అధికారుల, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.