రానున్న 15 రోజులు జిల్లాలోని వాడ వాడల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలందరినీ భాగస్వాములను చేసేవిధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి మహేందర్ రెడ్డి, ఇతర శాఖల కార్యదర్శులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కె. మనోహర్, అదనపు కలెక్టర్లు మను చౌదరి, మోతిలాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు ప్రభుత్వం ద్వారా సూచించిన రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించనున్నారో వివరించారు. జిల్లాలోని ప్రతి ఒక్కరిలో వాడ వాడల్లో దేశభక్తి, పెంపొందించడం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న సమరయోధులను స్మరించుకునే విధంగా సామూహిక పండగ వాతావరణం ఏర్పడే విధంగా ప్రతి శాఖకు చెందిన ప్రతి అధికారి పోలీస్, స్వచ్చంద సంస్థలతో సహా తమవంతు బాధ్యతలు నిర్వహించే సన్నద్ధం కావాలని అధికారులను సూచించారు. 8వ తేదీన హైద్రాబాద్ లోని హెచ్.ఐ.సి.సి లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి జడ్పిటిసి లు, ఎంపీపీ లు, మున్సిపల్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జిల్లా నుండి హాజరు అయ్యేవిధంగా ఇప్పటికే అందరికి ఆహ్వాన పత్రాలు, బస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 8వ తేదీన ఉదయం 6 గంటలకు నాగర్ కర్నూల్ జడ్పి కార్యాలయం నుండి బస్సు బయలుదేరే విధంగా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. 9వ తేదీన జిల్లా లోని 2 లక్షల కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేసేవిధంగా ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. 13, 14, 15 తేదీలలో ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఉండేవిధంగా పకడ్బందీగా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. 10వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో, మండలాల్లో వనమహోత్సవం నిర్వహించి ప్రతి చోట 75 మొక్కలకు తగ్గకుండా నాటేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 11వ తేదీన జిల్లాలో, మండలాల్లో ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, 12న జిల్లాలోని అన్నీ లోకల్ కేబుల్ చానల్ లో దేశభక్తి పాటలు, సినిమాలు ప్రసారం అయ్యే విధంగా జిల్లా పొర సంబంధాల అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల 9 వ తేదీ నుండి 22వ తేదీ వరకు అన్ని పనిదినాల్లో జిల్లాలోని 9 సినిమా హాళ్లలో ఉదయం 10 గంటల నుండి ఉచితంగా గాంధీ సినిమాను ప్రదర్శించడం జరుగుతుందని, ఈ సినిమాను 6వ తరగతి నుండి విద్యార్థులకు సినిమా చూపించే విధంగా పకడ్బందీగా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. ముందుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ తర్వాత ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు సినిమా చూపించడం జరుగుతుందన్నారు. 13వ తేదీన ర్యాలీలు, త్రివర్ణ బెలూన్లు వదలడం జరుగుతుందన్నారు. 14వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం బాణాసంచా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 15 న ఘనంగా జాతీయ దినోత్సవం, 16 న జిల్లాలో, మున్సిపాలిటీలు, మాంసలాల్లో సామూహిక జాతీయ గితాలాపనకు భారీ ఎత్తున పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 17 న జిల్లాలోని అనేకచోట్ల జిల్లా, మున్సిపాలిటీ, మండలాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 18వ తేదీన జిల్లా స్థాయి ఫ్రీడమ్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుందని అంతకు ముందు నుంచి అన్ని మండలాల్లో క్రీడలు నిర్వహించి విజేతలకు 18న జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 19న ప్రభుత్వ ఆసుపత్రులు, అనాధ శరణాలయాలు, జైల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, 20వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో స్వయం సహాయ సంఘాల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 21న జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి దేశభక్తి, స్వాతంత్ర్య స్ఫూర్తి పై తీర్మానం చేయడం జరుగుతుందన్నారు. 22వ తేదీన హైద్రాబాద్ లాలబహదూర్ శాస్త్రి మైదానమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి జిల్లా నుండి ప్రజలను తరలించేందుకు ప్రాణాలికలు చేయడం జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన అందరూ జిల్లా అధికారులకు తమ తమ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 15 రోజుల పండగ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు ప్రతిఒక్కరు నిబద్ధతతో కృషిచేయాలని ఆదేశయించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ఎస్పీ కె. మనోహర్, ఆదనవు కలెక్టర్లు మనుచౌదరి, మోతిలాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.