రాబోయే మూడు నాలుగు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్ట్ 30:–
రాబోయే మూడు నాలుగు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

ప్రజలు ఎవరూ కూడా లో లైన్  ఏరియాలకు,  తెగిపోయిన రోడ్ల వద్దకి, పొంగిపొర్లుతున్న బ్రిడ్జిలు చెరువులు,వాగుల వద్దకు వెళ్లవద్దని ఆయన సూచించారు.

పాత భవనాలు, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉండకుండా స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ ,తహసిల్దార్ ,ఎం పీ ఓ, ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్ తదితర స్థానిక అధికారులతో మాట్లాడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పంచాయతీ సెక్రటరీలు ఆయా అధికారులు సంబంధితులను ప్రభుత్వ భవనాలలోకి తరలించి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో
ఎం పీ ఓలు ,ఎం పీ డీ వో లు మానిటరింగ్ చేయాలని సూచించారు.
పడిపోయేలా ఉన్న పాత చెట్లు,  విరిగి పోయేలా ఉన్న కొమ్మలను తొలగించాలని, రోడ్ కటింగ్ ఉన్న చోట ప్రజలు వెళ్లకుండా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు . విద్యుత్ స్తంభాలు, లైన్స్ కు సంబంధించి సరిచేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
తాగునీటి సరఫరా పైపులు లీకేజీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చేపలు పట్టడానికి చెరువులు, వాగుల వద్దకు వెళ్లా రాదని తెలిపారు.

ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఇండ్లలో ఎయిర్ ఫ్లో ఉండేలా చూసుకోవాలని,  వర్షంలో తడవకూడదని, వేడిచేసి చల్లార్చి వడపోసిన నీటిని త్రాగాలని, ఆహారం వేడివేడిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పాము కాటు,డయేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆశ ,అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలని, తగిన మందులు అందుబాటులో ఉన్నాయని, దగ్గరలోని సబ్ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలలో చికిత్స పొందాలని సూచించారు.

క్షేత్ర స్థాయి అధికారి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు తమ హెడ్క్వార్టర్స్ లోనే ఉండాలని స్పష్టం చేశారు. అన్ని వేళలా అప్రమత్తులై జిల్లాలో ఏ ప్రమాదం జరక్కుండా ఆయా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.

Share This Post