రాబోవు వానకాలం సీజన్లో వరి, ఇతర పంటలు వేసే రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే విత్తన చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

ప్రచురునార్ధం

వరంగల్

మే 13

రాబోవు వానకాలం సీజన్లో వరి, ఇతర పంటలు వేసే రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే విత్తన చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

శుక్రవారం రోజున హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలులో వరంగల్, హనుమకొండ జిల్లా లకు సంబందించిన

విత్తన కంపెనీ ప్రతినిధులకు, డీలర్ల కు, డిస్ట్రిబ్యూటర్ లకు విత్తన చట్టం పైన అవగాహన సదస్సు ను ఏర్పాటు చేసారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి గోపి మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయిన రైతులు అహర్నిశలు పండించిన పంటలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసి… వారికి లాభాలు గడించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు

రైతులు నాణ్యమైన పంటలు పండించాలంటే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని అప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయని విత్తనం మంచిదయితే దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంటుందని అన్నారు

జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన షాపులపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని… నకిలీ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అమ్మ రాదని… నిబంధనల ను ఉల్లంగిస్తే

అట్టి షాపు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు

విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు

Share This Post