రామగిరి మండలం లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రతి పల్లెను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి

జూన్ చివరి నాటికి మన ఊరు మన బడి పనులు పూర్తి

ప్రభుత్వ బడులలో అవసరమైన అన్ని వసతుల కల్పన

రామగిరి మండలంలోని సుందిళ్ల, నాగ పల్లి, నరసింహ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి జూన్ 4: జిల్లాలోని ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని డాక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం రామగిరి మండలంలోని సుందిళ్ల లోని పుష్కర ఘాట్,నాగ పల్లి,నరసింహ పల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.

గ్రామ ప్రత్యేక అధికారి, సర్పంచ్ ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి పల్లెల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు శుభ్రం చేసుకోవాలని, ఇండ్లలో ఉన్న పాత కూలర్లు ,టైర్లలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమం కింద నాగేపల్లి , నరసింహ పల్లి గ్రామాలలో జెడ్ పి హెచ్ ఎస్, ఎంపీపీ ఎస్ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. జూన్ చివరి నాటికి మన ఊరు మన బడి పనులు పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాటు విద్యాశాఖ ద్వారా జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అంగన్వాడీలో 5 సంవత్సరాల నిండిన పిల్లలు, పాఠశాల డ్రాపౌట్ పిల్లలు , ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించేందుకు ఆసక్తిగల వారిని గుర్తించి , ఉపాధ్యాయులు అడ్మిషన్స్ అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభమవుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అవసరమైన అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడలో దిశగా ప్రోత్సహించడానికి ఏర్పాటు చేస్తున్న గ్రామీణ క్రీడ ప్రాంగణాలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించే దిశగా పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

మండల ప్రత్యేక అధికారి మైనింగ్ ఏడి సాయినాథ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య,రామగిరి తహసిల్దార్ పుష్పలత, ఎంపిడిఓ రమేష్,ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post